దేశంలోని ప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ అట్లాస్ మాజీ ప్రెసిడెంట్ సలీల్ కపూర్ మంగళవారం దిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న కపూర్ మృతదేహాన్ని కుటుంబీకులు గుర్తించి సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో అతడిని వేధించిన వ్యక్తుల పేర్లు ఉన్నట్లు సమాచారం. సలీల్ సోదరుడు, అట్లాస్ సైకిల్ యజమాని సంజయ్ కపూర్ భార్య సైతం కొన్నేళ్ల క్రితం సూసైడ్ చేసుకున్నారు.