పుష్ప-2 ప్రీమియర్ షో నేపథ్యంలో ఆర్‌టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై తాజాగా ట్వీట్టర్ వేదికగా అల్లు అర్జున్ టీం స్పందించింది. ‘‘ఇది నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కుటుంబాన్ని మా టీమ్ కలవనుంది. అవసరమైన సపోర్ట్ చేస్తాం’’ అని పేర్కొంది.