డిసెంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'పేదల కలను ఆనాడే ఇందిరమ్మ గుర్తించింది. దేశంలో ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదు. ఆత్మ గౌరవంతో బతకాలనేదే ప్రతి ఒక్కరి కల. ఆ కల నెరవేరాలంటే సొంత ఇళ్లు ఉండాలి. కూడు, గూడు, గుడ్డ అందరికీ అందాలనేదే మా ఆలోచన' అని అన్నారు.