గాంధీ జీవన విధానం మనందరికీ ఆదర్శం: వెంకట్ గౌడ్

66చూసినవారు
గాంధీ జీవన విధానం మనందరికీ ఆదర్శం: వెంకట్ గౌడ్
బుధవారం గాంధీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆందోల్ మండలం అక్సాన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మహాత్ముడు జీవించిన విధానం ఆదర్శమని కొనియాడారు. సత్యం ధర్మం సిద్ధాంతాలను ప్రజలు మరువకూడదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్