హత్నూర మండలంలోని చందపూర్, పాల్పనూర్ గ్రామాల్లో జరుగుతున్న కుల గణనను కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. రెండు గ్రామాల్లో పర్యటించి కులగణ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారని ఎన్నేమరేటర్లకు సూచించారు. ప్రజలు కుల గణన కు సహకరించాలని కోరారు.