సంగారెడ్డి జిల్లా అందోలు-జోగిపేటలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన శౌర్య యాత్రకు చుట్టుపక్కల గ్రామాల నుండి భజరంగ్ దళ్ కార్యకర్తలు రామ దండులా తరలివచ్చారు. జోగిపేట పట్టణంలో జరిగిన ర్యాలీలో రాంసానిపల్లి బజరంగ్దళ్ సేన స్వచ్చందంగా పాల్గొన్నారు. ర్యాలీకి వెలుతున్న సందర్భంగా వారు కాషాయపు రంగులో ఉన్న ప్రత్యేక దుస్తులను దరించి నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.