రాయికోడ్ మండల పరిధిలోని అల్లాదుర్గ్ - మెటల్ కుంట ప్రధాన రహదారి అయిన సిరూర్ పరిధిలో గత రెండు సంవత్సరాలుగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ఇండ్లల్లో, హోటల్లో, పొలాలలోకి దుమ్ము ధూళి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చుట్టూ గ్రామాల ప్రజలు ఆదివారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని.. లేనిచో పూర్తిగా రాకపోకలను నిలిపివేస్తామని ఆదివారం ప్రభుత్వానికి హెచ్చరించారు.