సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో తెలంగాణ ఆదర్శ పాఠశాలలో విద్యార్థినులకు శుక్రవారం స్థానిక ఎస్సై కిష్టయ్య మహిళల రక్షణకు ఉన్న చట్టాల పై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ప్రభావం, సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, ఫోక్సో చట్టాలు, అపరిచిత వ్యక్తుల పట్ల ఎట్లా ఉండాలనే అంశాల పై వివరించారు. రోడ్డు ప్రమాదాలు, మైనర్ డ్రైవింగ్, సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించారు.