నవ్య భారతి యువజన సంఘం అధ్యక్షులు నాయికోటి భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో వివేకానంద 163వ జయంతి సందర్బంగా యువజన సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. భాస్కర్ మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానంద ఆశయాలను పాటిస్తూ ఆయన బాటలో నడవాలన్నారు.