కంది: ఎంకన్న స్వామికి అభిషేక పూజలు
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట గ్రామ శివారులోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు, అలంకరణ చేసి వారోత్సవ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు.