శంకరంపేట మండలంలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనతో కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు నిరసనను తెలిపారు. నిరసన కార్యక్రమంలో ఏఈఓ లు మమత, వినీత్, అఖిల్, హుస్సేన్ పాల్గొన్నారు.