నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ గడువును ఈనెల 30వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, వసతి లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. విద్యార్థులు http: //bse. telangana. gov. in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.