నాగల్ గిద్ద మండలం మెగా నాయక్ తండాలోని భవానీ మందిరంలో గురువారం నిర్వహించిన బోగ్ బండార్ కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.