మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్

2683చూసినవారు
ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహకారంతోమనూర్ మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మనూర్ సర్పంచ్ శివాజీ రావు మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మనూర్ రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె రోడ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ నిధులతో సిసి రోడ్లు నిర్మాణానికి భారీగా ప్రాధాన్యతనిస్తున్నది ఇందులో భాగంగా 45 లక్షలు నిధులతో మనూర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు, ప్రాథమిక ఉన్నత పాఠశాల నుండి డోవుర్ రోడ్డు వరకు 550 మీటర్లు నిర్మాణం చేపట్టడంతో స్థానిక ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. గ్రామ సర్పంచ్ శివాజీ పటేల్, మనూర్ మండల బి ఆర్ఎస్ అధ్యక్షులు విట్టల్ రావు పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బాపూజీ గ్రామ స్వరాజ్యం కన్నా కలలు మా ప్రభుత్వ నెరవేరుస్తుందన్నారు. గ్రామీణ ప్రగతికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎంపీపీ జయశ్రీ మోహన్ రెడ్డి, జడ్పిటిసి పుష్ప మోహన్ రావు, కృషితో మండల రూపురేఖలు మారుతున్నాయన్నారు. గతంలో రోడ్లు అధ్వానంగా గుంతలుగా మారడంతో ఎమ్మార్వో, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్, కార్యాలయల కు పోవాలంటే చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవార న్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా కష్టాలు తీరానున్నాయి.

గ్రామంలో డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, వైకుంఠధామారతం, చెత్త మోయడానికి ట్రాక్టర్, పార్కులు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, రైతు వేదికలు, మిషన్ భగీరథ ట్యాంకులు, ఇంటింటికి నల్ల సౌకర్యం, వితంతులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లోన్ల సబ్సిడీలు పెంచడం, నర్సరీలు పెంచడం, రోడ్ల కి ఇరువైపున మొక్కలు నాటడం, మన ఊరు మనబడి తో పాఠశాల బాగు చేయడం, నూతనంగా అంగన్వాడి సెంటర్ ప్రారంభించడం, అన్ని వర్గాల ప్రజలకు కమిటీ హాల్ నిర్మించడం ఉపాధి హామీ పనులు కూలీలకు ప్రాధాన్యత ఇవ్వడం మునుమందు మరిన్ని అభివృద్ధి నిధులతో పనులు చేస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్