గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులు దొంగ బిల్లులతో దోచుకున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ లోని క్యాంపు కార్యాలయంలో 101 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిని ప్రభుత్వం ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.