నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జోగిపేట మలుపు దగ్గర శుక్రవారం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. దీంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి. సంగారెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో పలువురిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన వారిని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించిన విషయం తెలుసుకొని వైద్యులకు ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.