నేడు కంగ్టిలో ప్రజావాణి కార్యక్రమం

85చూసినవారు
నేడు కంగ్టిలో ప్రజావాణి కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10: 30 గంటలకు మధ్యాహ్నం 1: 30 వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ విష్ణు సాగర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లకుండా మండల ప్రజావాణికి రావాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్