జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన బీరప్ప జాతరలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తో కలిసి జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నరు. బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొన్నారు.