సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో భూములు కొనే వారు తస్మా త్ జాగ్రత్త అని ఎస్ఐ వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఎక్కడో గుట్టల మీద, పనికి రాని భూములకు ఉన్న పట్టా పాసుబుక్ ద్వారా మధ్యవర్తులు, దళారులు, గ్రామ మనిషి ఒక టీం గా ఏర్పడి మోసానికి పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. భూమి కొనుగోలు చేసే బయట వ్యక్తులు ఫిజికల్ గా అన్ని పరిశీలించాకే కొనుగోలు చేయాలని సూచించారు.