పటాన్‌చెరు మండలం - Patancheru Mandal

సంగారెడ్డి జిల్లా
మెదక్: బైక్‌పై నుంచి వెళ్లిన టిప్పర్.. చెలరేగిన మంటలు
Dec 02, 2024, 04:12 IST/మెదక్ నియోజకవర్గం
మెదక్ నియోజకవర్గం

మెదక్: బైక్‌పై నుంచి వెళ్లిన టిప్పర్.. చెలరేగిన మంటలు

Dec 02, 2024, 04:12 IST
ద్విచక్ర వాహనంపై నుంచి టిప్పర్ వెళ్లడంతో మంటలు చెలరేగి వాహనదారుడు తీవ్రంగా గాయపడిన సంఘటన తూప్రాన్ లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందం వివరాల ప్రకారం.. తూప్రాన్ పట్టణానికి చెందిన చాకలి దశరథ (50) పరిశ్రమలో పని చేయడంతో పాటు ఇస్త్రీ చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం పరిశ్రమకు వెళ్లి ద్విచక్రవాహనంపై తూప్రాన్ వైపు తిరిగి వస్తున్నాడు. నర్సాపూర్ చౌరస్తా వద్ద డస్ట్ లోడుతో వెళ్తున్న టిప్పర్.. ద్విచక్రవాహనాన్ని ఢీకొని కొంత దూరం లాక్కెళ్లింది. రాపిడితో మంటలు చెలరేగి ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోగా.. దశరథ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. మంటల్లో చిక్కుకున్న అతడిని స్థానికులు కాపాడి.. 108 వాహనంలో తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.