గుమ్మడిదల మండలనికి చెందిన కృష్ణ గొర్లకోటంపై వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేయగా 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని గొర్రెలకు తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మండల వెటర్నరీ డాక్టర్ అరుణ స్థానిక నాయకులతో కలిసి బాధిత రైతును పరామర్శించారు. రైతుకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.