సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి తీవ్ర ఉక్కపోతతో మండల ప్రజలు ఆపసోపాలు పడ్డారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో కాస్త ఉపశమనానికి గురయ్యారు. కాగా గత రాత్రి మండలంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే.