సంగారెడ్డి జిల్లా పటన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో 3వ దీక్షంత్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్ ఫోర్స్ ట్రైనింగ్ ప్రతిభ కనపర్చిన కానిస్టేబుళ్లకు మెడల్స్తో పాటు జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.