సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో బుధవారం మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా పాత మున్సిపాలిటీలోని గాంధీ విగ్రహానికి బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బొల్లారం మున్సిపాలిటీకి సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు శాలువతో సన్మానించి వారికి బెస్ట్ వర్కర్ గా ప్రశంస పత్రం అందజేశారు.