రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట భాస్కర్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా హైదరాబాదులో గురువారం అవార్డును అందుకున్నారు. భాస్కర్ మాట్లాడుతూ తనకు రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. విద్యార్థులకు వినూత్న కార్యక్రమాల ద్వారా బోధించడం ద్వారా అవార్డు వచ్చినట్లు చెప్పారు.