సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో సోమవారం హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. పటేల్ గూడా గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 12 ప్రభుత్వ భూమిలో గతంలో ఇళ్లు కూల్చివేసిన అధికారులు భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో గ్రామానికి చేరుకున్నారు. గతంలో కూల్చివేసిన నిర్మాణాల వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.