సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలోని ఆలేటి వీర రెడ్డి కాలనీలో రోడ్డు పై మురుగు నీరు ప్రవహించడంతో స్థానిక కాలనీ వాసులు ప్రయాణం కొనసాగించడానికి అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై ప్రవహించిన మురుగు నీటితో దుర్గంధం వెదజల్లుతుందని కాలనీ వాసులు వాపోయారు. అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.