సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి గ్రామంలోని వలస కుటుంబాలు కాలనీలో మౌలిక వసతులు మెరుగుకు కృషి చేయునట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్రాంతి బొల్లారం, కాజిపల్లి గ్రామాలలో పర్యటించారు. కలెక్టర్ ముందుగా ఖాజిపల్లి గ్రామంలో జిఎంఆర్ కాలనీలో వలస కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వలస కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.