సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు మహిళలు శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరలక్ష్మీ వ్రత విగ్రహానికి అందంగా ముస్తాబు చేసి ప్రతిష్టించారు. అనంతరం పలు రకాల పండ్లు పిండి వంటకాలను చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. శ్రావణమాసం సందర్భంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు.