సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 8వ తేదీన ఉత్తరా నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవల కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం గురుస్వామి తెలిపారు. దేవాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, కలశార్చన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. రాత్రి 7 గంటలకు శబరిమలలో జరిగే విధంగా మహా పడిపూజ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.