జిల్లాలో డిజిటల్ ఫ్యామిలీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రయోగాత్మకంగా రెండు గ్రామాల్లో మొదట సర్వే నిర్వహించాలని చెప్పారు. ట్రైనీ కలెక్టర్ మనోజ్, డిపిఓ సాయి బాబా పాల్గొన్నారు.