లక్ష్మీ నారాయణస్వామి కి అభిషేకాలు

73చూసినవారు
శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా కొండాపూర్ మండలం మారేపల్లి లోని లక్ష్మీ నారాయణ స్వామికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పంచామృతాలు, పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. భక్తులు జై లక్ష్మీనారాయణ అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు. శ్రావణమాసం నెల రోజులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్