బుధవారం అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 91147 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేస్తూ 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసిన సందర్భంగా సంగారెడ్డిలో టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ విద్యార్థి అమరవీరులకు నివాళ్ళు అర్పిస్తూ, బాణసంచా లు పేలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువకులు జైపాల్ నాయక్, రాజేందర్ నాయక్, ప్రదీప్ యాదవ్, శ్రీకాంత్ కౌన్సిలర్, సోయల్, రవి, పూల్సింగ్, అనిల్, విగేష్, వసంత్, దినేష్, విజయ్, శ్రీనివాస్, సతీష్, శివాజీలు పాల్గొన్నారు.