డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి కలెక్టర్ వల్లూరు క్రాంతితో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.