సంగారెడ్డి జిల్లాలోని ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 31 వరకు గడువు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యలో చదువు ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం స్థానికంగా ఉండే ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో సంప్రదించాలన్నారు.