పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. సంగారెడ్డిలో శాంతి కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వినాయక మండప నిర్వహకులు పోలీసుల నిబంధనలు పాటించాలని చెప్పారు. మిలాద్ ఉన్ నబి, వినాయక నిమజ్జనం ఒకేసారి రావడంతో ఇరువర్గాల వారు శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు. సమావేశంలో సిఐ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.