సంగారెడ్డిలో ఎడతెరిపి లేని వర్షం

70చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో శనివారం ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్