78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర జాతీయ జెండాను గురువారం ఆవిష్కరించారు. న్యాయవాదులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.