కంది గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ గురువారం పగిలిపోయింది. గంటకు పైగా లీకేజీ కావడంతో మంచినీళ్లు రోడ్డుపై పారాయి. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అధికారులకు ఫిర్యాదు చేయడంతో నేటి సరఫరాను నిలిపివేశారు. పైప్ లైన్ కి మరమ్మత్తులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు