కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం చేప పిల్లలు వదిలి పెట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. 4 లక్షల చేప పిల్లలను చెరువులో విడుదల చేసినట్లు చెప్పారు. మత్స్యకారులు సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.