రేజింతల్ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం బుధవారం భక్తజన సంద్రమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రేజింతల్ గ్రామంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సద్గురు శ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహారుద్రము, శ్రీ సూక్త పారాయణము మరియు లక్ష మోదక హవన కార్యక్రమాలు జరిగాయి. ఈనెల 19వ తేదీ నుండి మొదలుకొని నాలుగు రోజుల పాటు యజ్ఞ హోమాధి వైదిక క్రతువులు వేదోక్తంగా జరుగాయి.