అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.