కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటానికి సైనికుల్లా పనిచేద్దామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కంది లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కెసిఆర్ ఆమరణ దీక్ష చేయడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.