అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న జర్నలిస్టు రంజిత్‌పై హీరో మోహన్ బాబు దాడి చేయడం సరికాదని శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాము గురుస్వామి అన్నారు. సంగారెడ్డిలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయ్యప్ప దీక్ష దారునికి మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.