దళిత మహిళా సునీత పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్య తీసుకోవాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి లోని కొత్త బస్టాండ్ ముందు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ మాట్లాడుతూ ప్రజాపాలన అంటే దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమా అని ప్రశ్నించారు. సునీత కుటుంబానికి ఎక్స్ గ్రేషియ అందించాలని డిమాండ్ చేశారు. దత్తు, చంద్రశేఖర్, దాసు, అశోక్ పాల్గొన్నారు.