సంగారెడ్డి పట్టణంలోని భవాని భువనేశ్వరి దేవాలయంలో ఈనెల 17వ తేదీన పూర్వాషాడ నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, 10 గంటలకు సామూహిక కుంకుమార్చన జరుగుతాయని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.