మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మహిళా క్యాంటీన్ ను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్ఓ పద్మజ రాణి పాల్గొన్నారు.