సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం శనివారం రాత్రి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసాను చదివారు. అనంతరం హనుమంతునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. స్వామి వారికి మహానైవేద్యం, మంగళహారతులను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హనుమంతుని దర్శించుకున్నారు.