గురుకుల పాఠశాలలో నిత్యవసర సరుకుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని అదనపు కలెక్టర్ మాధురి అన్నారు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. బియ్యం, పప్పు, ఇతర వస్తువులు నాణ్యతగా ఉంటేనే తీసుకోవాలని చెప్పారు. తనిఖీల్లో ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.