సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 2, 400 మంది మహిళలతో ఈనెల 23వ తేదీన అనఘ దత్త వ్రతం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. సంగారెడ్డి లోని ఆశ్రమంలో శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వ్రతం కు వచ్చే మహిళలు సాంప్రదాయ బద్ధంగా రావాలని చెప్పారు. కార్యక్రమంలో సంధ్య విలాస్ పాల్గొన్నారు.